…భారత్ న్యూస్ హైదరాబాద్….మెదక్:
తోషిబా కొత్త యూనిట్లు ప్రారంభం: 562 కోట్లతో ఉద్యోగ అవకాశాలు
మెదక్ జిల్లా, పటాన్ చెరు మండలం రుద్రారం సమీపంలో తోషిబా పరిశ్రమలు రూ. 562 కోట్లతో నిర్మించిన రెండు నూతన యూనిట్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.
ఈ పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా పాలసీని అమలు చేస్తుందని మంత్రి తెలిపారు.
ఈ ప్రారంభోత్సవం ద్వారా తెలంగాణలో మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
