భారత్ న్యూస్ మంగళగిరి Aug 09, 2025,….Ammiraju Udaya Shankar.sharma News Editor…2029లో టీడీపీ సీఎం అభ్యర్థిగా లోకేశ్?
2029లో టీడీపీ సీఎం అభ్యర్థిగా లోకేశ్?
ఆంధ్రప్రదేశ్ : మంత్రిగా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ తనకంటూ ఓ ఇమేజ్, బ్రాండ్ సృష్టించుకుంటున్నారు. పార్టీ భవిష్యత్ లీడర్‌గా కేడర్ నీరాజనాలందుకుంటున్నారు. ఈ క్రమంలో 2029లో పార్టీ సీఎం అభ్యర్థిగా ఎదగాలని లోకేష్ ప్రయత్నిస్తున్నారని, సొంత టీమ్‌ను రంగంలోకి దించారని ‘రైజ్’ సర్వే సంస్థ చీఫ్ ప్రవీణ్ పుల్లట చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఇదే నిజమైతే జనసేన ఎలా స్పందిస్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
