ట్రంపు దెబ్బకు రొయ్యల రైతు కుదేలు

భారత్ న్యూస్ విజయవాడ…ట్రంపు దెబ్బకు రొయ్యల రైతు కుదేలు

🦐అమెరికా సుంకాల పెంపుతో తగ్గిన రొయ్యల ధరలు

🦐పంట చేతికొచ్చే దశలో ఆక్వా రైతుకు కోలుకోలేని దెబ్బ

🦐ఆక్వా రంగంపై ప్రభావం ఉంటుందన్న సిఎం చంద్రబాబు

🅟︎🅡︎🅐︎🅙︎🅐︎🅢︎🅐︎🅚︎🅣︎🅗︎🅘︎

🦐మన దేశం నుంచి అమెరికాకు రొయ్యలు ఎగుమతి అవుతుండడంతో అక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ ఈ తీవ్ర ప్రభావం పడుతోంది.
అమెరికా అధ్యక్షులు ట్రంప్ భారత్ ను రష్యాతో వాణిజ్యంపై హెచ్చరిస్తూ సుంకాల పెంపును
ప్రకటించారు.

🦐తొలుత 25 శాతం సుంకం
విధించారు. ఆ తర్వాత మరో 25 శాతం కూడా విధించారు. దీంతో, సుంకం 50 శాతానికి చేరింది. దీంతో, రెండు, మూడు రోజుల్లోనే రొయ్యలు
పతనమయ్యాయి. ట్రంప్ ప్రకటనను
అడ్డుపెట్టుకొని కూడా వ్యాపారులు ధరల తగ్గిస్తున్నారని రైతులు చెబుతున్నారు.

🦐పంట చేతికి వచ్చే దశలో ఈ పరిణామాలతో వారు తీవ్రంగా
నష్టపోతున్నారు. ఈ నెల రెండున ‘అన్నదాతా సుఖీభవ’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రకాశం
జిల్లా దర్శి వచ్చిన సిఎం చంద్రబాబు కూడా ట్రంప్ సుంకాలు పెంపు ప్రభావం ఆక్వా రంగంపై
పడుతుందని చెప్పారు.

🦐ప్రత్యామ్నాయాలు
ఆలోచించాలి. ఎగుమతులపైనా ఆంక్షలు, ప్రభావం
కంపెనీలు కూడా రొయ్యలను విదేశాలకు ఎగుమతిపైనే దృష్టి పెడుతున్నాయి. శింగరాయకొండ వద్ద ఉన్న భారీ ప్రాసెసింగు
కంపెనీలు ఎగుమతులపైనే నడుస్తున్నాయి.

🦐నిలిచిన ఎగుమతులు🦐

🦐ఒక కంటైనర్లో 16 టన్నులు ఎగుమతి అవుతుంటాయి. దీని విలువ సుమారు రూ.1.28 కోట్ల వరకూ ఉంటుంది. గతంలో ఐదు శాతం
ట్యాక్స్ ప్రకారం ఎగుమతిదారులు రూ.6.40 లక్షలు ఉండడంతో మొత్తంగా ఆక్వా రంగం సంక్షోభంలో కట్టేవారు. సుంకం 50 శాతానికి పెంపు వల్ల
పడింది.

🦐ధరల పతనం ఇలా…🦐

🦐ఇటీవల వరకూ 20 కౌంట్ రొయ్యల ధర కిలో రూ.640 ఉండగా, ఇప్పుడు రూ.590కు పడిపోయింది. 30 కౌంట్ ధర రూ.470, 40కౌంట్ ధర రూ.380 ఉంది. వీటి ధర సగటున
కిలోకు ధర రూ.40 పతనమైంది. ఈ లెక్కన టన్నుకు రూ.4 లక్షల వరకూ నష్టం వాటిల్లుతోంది.
వెనామీ రొయ్య వంద కౌంట్ రూ.250 నుంచి 220 కు
పడిపోయింది.

🦐ఎగుమతుల్లో 20 శాతమే అమెరికాకు..

🦐మన రాష్ట్రం నుంచి రొయ్యలు అమెరికాకు 20 నుంచి 30 శాతం ఎగుమతి అవుతుంటాయని
ఆక్వా రైతులు తెలిపారు. ఎక్కువగా శాతం చైనా,
జపాన్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.

🦐అమెరికా ప్రభావమే ఎక్కువగా ఎగుమతులపై ఉంటుందని చెబుతున్నారు. రొయ్యలను దేశీయ వినియోగం తక్కువగా ఉంది. రెస్టారెంట్లలోనూ
వీటిని తక్కువగా వినియోగిస్తున్నారు. ఆక్వా
ఇప్పుడు రూ.64 లక్షలు కట్టాలి. దీంతో, ఎగుమతులు నిలిచిపోయాయి.

🦐తక్కువ కౌంట్
రొయ్యలను స్థానిక రెస్టారెంట్లు, మార్కెట్లలో అమ్మకాలు చేస్తే ధరలు హెచ్చుతగ్గుల సమయాల్లో
నష్టం తగ్గే వీలుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కోస్తా ప్రాంతంలో ఆయువుపట్టుగా ఆక్వా సాగు ఉంది.