…భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రవేట్ విద్య సంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలని ఈనెల 23న బంద్ కు పిలుపు!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న తీవ్రమైన సమస్యలను పరిష్కరిం చాలని.. అదే సమయంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీ జుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఉద్య మానికి సిద్ధమయ్యాయి.

ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తం గా పాఠశాలలు, జూనియర్ కళాశాలల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపుని చ్చారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయం లో బంద్ పోస్టర్‌ను ఆవిష్క రించి తమ ఆందోళనను తెలియజేశారు.
తెలంగాణ విద్యా వ్యవస్థ లో పాతుకుపోయిన లోపాలను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఈ బంద్ ద్వారా హైలైట్ చేయాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్లు..విద్యార్థి సంఘా లు తెలంగాణ ప్రభుత్వానికి సమగ్రమైన డిమాండ్లను సమర్పించాయి,
ఇవి రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులను ఆశిస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా.. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారం ఫీజులు పెంచడం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు ద