
ఒక నమ్మకం.. ఒక సంకల్పం.. ఒక ఆశయం.. ప్రజా రాజధాని కోసం కలిసిన అడుగులు. కలిసి నడిపిస్తుందన్న ఆశ. అమరావతి నిర్మాణంలో మరో నవశకం. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనుల పునఃప్రారంభం ఒక చారిత్రక ఘట్టం. ఇక అమరావతి అన్ స్టాపబుల్‌గా మారుతుందా? ప్రపంచంలోనే టాప్ 5 సిటీల్లో ఒకటిగా నిలుస్తుందా?
అమరావతి చరిత్రలో నవశకం మొదలైంది. ఇక ముగిసిపోయిందనుకున్న ప్రజారాజధానికి కొత్త ఊపిరులూదుతూ సరికొత్తగా పనులు పునఃప్రారంభమయ్యాయి. రీస్టార్ట్ అయింది. ఇక అన్ స్టాపబుల్ అంటోంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతిలో 18 ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగింది. మొత్తం 57,962 కోట్ల రూపాయలతో పనులు జరగబోతున్నాయి. అసెంబ్లీ, సెక్రెటరీ, న్యాయమూర్తులు, ఉద్యోగుల భవనాలు, ఐకానిక్ టవర్లు, నెక్ట్స్ జెనరేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రాబోతోంది. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ విజన్ కు దోహదం చేసేలా అమరావతి నిర్మాణం కోసం రికార్డు సమయంలో అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. పనులు క్వాలిటీతో పూర్తి చేయాలన్నా, త్వరగా పూర్తి చేయాలన్నా సీఎం చంద్రబాబును మించిన వారెవరూ లేరన్నారు మోడీ.
రైతులు త్యాగాలు చేసినా, పోరాటాలు చేసినా గత ఐదేళ్లు రాజధాని ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. కానీ ఇప్పుడు కథ మారిపోతోంది. అమరావతికి పునరుజ్జీవం కల్పించే దిశగా తొలి అడుగు పడింది. అందుకు నిదర్శనమే ఈ శంకుస్థాపనలు. మూడేళ్లలో ప్రజారాజధానిని పూర్తి చేయడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. రాజధాని ప్రారంభోత్సవానికి మళ్లీ ప్రధాని మోడీ రావాలని సీఎం చంద్రబాబు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారంటే ఎంత సీరియస్ గా వర్క్స్ జరగబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఏపీ సమగ్రాభివృద్ధి జరుగుతోందన్నారు సీఎం చంద్రబాబు.
చరిత్ర సృష్టించే విశ్వనగరి రూపుదిద్దుకోబోతోంది. పీపుల్స్ క్యాపిటల్ RE BORN అవుతోంది. స్ట్రాటజిల్ లొకేషన్ లో ఉన్న ఈ అమరావతి ప్రాంతం.. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉంది. భౌగోళికంగా సులభంగా అన్ని ప్రాంతాల వారు యాక్సెస్ చేయడానికి వీలున్న నగరమిది. కృష్ణా నది తీరంలో, విజయవాడ – గుంటూరు వంటి ముఖ్యమైన వాణిజ్య నగరాలకు సమీపంలో ఉండడం మరో అడ్వాంటేజ్. ఇది ఆర్థిక కార్యకలాపాలకు అనుకూలంగా మారి సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. గత ప్రభుత్వం అమరావతి కలను తుడిచేసినా మళ్లీ వరల్డ్ క్లాస్ రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ప్రతి నగరానికి ఒక చరిత్ర ఉంటుంది. ఒక కథ ఉంటుంది. ఒక బలం ఉంటుంది. ఒక బలగం ఉంటుంది. వాటిని అందిపుచ్చుకుని ఒక భవిష్యత్ ను నిర్మించుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కూడా అదే చారిత్రక వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అద్భుత నగరంగా నెక్ట్స్ జెనరేషన్ సిటీగా నిలవడానికి సన్నద్ధమంటోంది.