భారత్ న్యూస్ కడప ..మైనార్టీ నాయకులు అబ్దుల్ బాబులను పరామర్శించిన సింహాద్రి రమేష్ బాబు
చల్లవల్లి:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, మైనార్టీ సెల్ నాయకులు అబ్దుల్ బాబులును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజవకర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు శనివారం పరామర్శించారు. బాబుల్ కుమారుడు, స్థానిక ప్రధాన సెంటర్లో టీస్టాల్ నిర్వాహకుడు మున్వర్(46) ఇటీవల గుండెపోటుతో మరణించారు. మున్వర్కు భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానిక కమ్యూనిస్టు పార్టీ ఆఫీసు వద్ద ఉన్న వారి గృహానికి వెళ్ళి బాబులు, మున్వర్ కుటుంబ సభ్యులను సింహాద్రి రమేష్ బాబు ఓదార్చారు. మున్వర్ చనిపోవటానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల చదువు ఇతర విషయాలపై ఆరాతీశారు. తామందరం అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని సింహాద్రి రమేష్ బాబు వారికి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు మోపిదేవి ద్వారకానాద్, మత్తి రాంబాబు, వెనిగళ్ళ తారకజగదీష్, అవనిగడ్డ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు అర్షద్, యడ్ల జగదీష్, జి.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
