..భారత్ న్యూస్ హైదరాబాద్….Metro Travel వాట్సాప్ ద్వారా మెట్రో టికెట్ ఎలా బుక్ చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..
Metro Travel: ఈ డిజిటల్ ప్రపంచంలో మెట్రో ప్రయాణం మరింత సులువైపోయింది. ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి లాంగ్ క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సాప్ ద్వారా మెట్రో టికెట్‌ను సులభంగా బుక్ చేసుకోవచ్చు.
హైదరాబాద్ మెట్రోతో పాటు, మరికొన్ని నగరాల్లో కూడా ఈ సదుపాయం ఇప్పటికే ప్రారంభమైంది. దీనివల్ల నిమిషాల్లోనే మీ మొబైల్ నుంచే టికెట్ తీసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మెట్రో టికెట్ బుక్ చేసుకునే పూర్తి ప్రక్రియ ఏంటో వివరంగా తెలుసుకుందాం.

ఇది ఒక డిజిటల్ సర్వీస్. ఇందులో మీరు వాట్సాప్ ద్వారా చాట్‌బాట్‌కు మెసేజ్ పంపి, మెట్రో టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్, సేఫ్. ఇందుకోసం మొబైల్లో వాట్సాప్ ఇన్స్టాల్ అయి, యాక్టివ్‌గా ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి. ఫోన్లో చెల్లింపుల కోసం UPI లేదా డెబిట్ కార్డు వంటి ఆప్షన్లు ఉండాలి.
వాట్సాప్ ద్వారా మెట్రో టికెట్ ఎలా బుక్ చేయాలి?
స్టెప్ 1: నంబర్‌ను సేవ్ చేసుకోండి
మొదటగా, మీ స్మార్ట్‌ఫోన్‌లో హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ వాట్సాప్ నంబర్ +91 8341146468ను సే