.భారత్ న్యూస్ హైదరాబాద్….అత్యాధునిక బంకర్ బస్టర్పై DRDO కసరత్తు
బంకర్ బస్టర్ మిస్సైల్ విషయంలో అమెరికాకి పోటీ ఇచ్చేలా DRDO కసరత్తు ప్రారంభించింది. అగ్ని-5 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ ఆధారంగా బంకర్ బస్టర్ మిస్సైల్స్పై పని చేస్తోంది. అగ్ని-5కి 5వేల కి.మీ. రేంజ్ ఉంటే.. వీటిని మాత్రం 2500 కి.మీ. రేంజ్లోనే తయారుచేస్తోంది. కాకపోతే ఇవి 7,500 కిలోలు మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవి భూమిలోకి 80-100 మీటర్లు చొచ్చుకెళ్లి విధ్వంసం చేయగలవని తెలుస్తోంది.
