భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ విద్యాశాఖ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం
అమరావతి :
ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియామకాల జాప్యంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యారంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ కేసులో భాగంగా కమిషనర్ విజయరామరాజు వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
