పాలిసెట్ కౌన్సెలింగ్ వాయిదా

భారత్ న్యూస్ విశాఖపట్నం..పాలిసెట్ కౌన్సెలింగ్ వాయిదా

ఆంధ్రప్రదేశ్ : పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. కళాశాలలకు అనుమతుల జారీలో జాప్యం జరుగుతుండటంతో వాయిదా వేశారు. ఈ నెల 20 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. 30కి వాయిదా వేశారు. కాగా, గత ఏప్రిల్ 30న పాలిసెట్ పరీక్ష నిర్వహించగా.. మే 14న ఫలితాలు విడుదల చేశారు. 1,39,840 మంది విద్యార్థులు పాలిసెట్ పరీక్షకు హాజరుకాగా.. 1,33,358 మంది అర్హత సాధించారు.