భారత్ న్యూస్ శ్రీకాకుళం….. ..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో కొత్త రేషన్ కార్డులపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో కొత్త రేషన్ కార్డుపై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. ఈ-కేవైసీ నమోదుతో కొత్త రేషన్ కార్డులను ఇవ్వనుంది.ఈ సర్వే ఆధారంగా బోగస్ రేషన్ కార్డులను ఏరివేసే పనిలో ప్రభుత్వం ఉంది. అర్హులైన వారికే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది. రేషన్ కార్డులు ఉన్న వారికి బియ్యం, చక్కెర, కందిపప్పు వంటివి అందిస్తోంది. కాగా, గత నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది.
