భారత్ న్యూస్ అనంతపురం .. ….కరెంట్ మీటర్ లింక్ తీయుటకు సంబంధించి :
కరెంట్ మీటర్ లింక్ తీయుటకు సంబంధించి :
దీనికిగాను గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారులు / వార్డు సచివాలయంలో వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారులు వారి యొక్క బెనిఫిషరీ మేనేజ్మెంట్ వెబ్సైట్ లాగిన్ లో ముందుగా అర్జీ నమోదు చేసి అర్జీ నెంబర్తో డి సీడింగ్ చేయాల్సి ఉంటుంది.

కరెంటు మీటరు ఆధార్ నెంబర్కు డి సీడింగ్ చేయు సమయంలో చాలా సచివాలయాలలో సరిగా పనిచేయటం లేదని కంప్లైంట్ పెడుతున్నారు.
సర్వీస్ ప్రారంభం నుండి సర్వీస్ పూర్తి చేయుట మొత్తం కూడా త్వరగా చేసినట్లయితే ఆ సర్వీస్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా స్పీడ్ గా ఉండాలి. మొబైల్లో కాకుండా కంప్యూటర్లో మాత్రమే ఈ సర్వీస్ చేయండి.
ఎవరికైతే ఆధార్కు కరెంటు మీటరు లింక్ తప్పించాలో వారు బయోమెట్రిక్ లేదా ఐరిష్ లేదా ఓటీపీ చెప్తే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది తరువాత సంబంధిత ఎలక్ట్రికల్ ఏఈ వారు తుది ఆమోదం చేయాల్సి ఉంటుంది.