భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…కూటమి నాయకులకు ఆహ్వానం
జల యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేయండి
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర వేడుకల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నాం 3:30 నుంచి సాయంత్రం వరకూ నాగాయలంకలోని కృష్ణా నదీ తీరం శ్రీరామ పాద క్షేత్రం వద్ద జలయోగాంధ్ర ఈవెంట్ ఏర్పాటు చేశారు.
ఈత+యోగాలో సుశిక్షితులైన అభ్యాసకులు, యోగా గురువులు కృష్ణానదీ జలాల్లో విభిన్న యోగా ఆసనాలు వేయనున్నారు.
ఈ జల యోగాంధ్ర వేడుకకు ముఖ్య అతిధులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు, కృష్ణాజిల్లా కలెక్టర్ శ్రీ డీకే బాలాజీ గారు, కృష్ణాజిల్లా ఎస్.పీ శ్రీ ఆర్.గంగాధర్ గారు విచ్చేయనున్నారు.

ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
కావున ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు విచ్చేసి జల యోగా వేడుకలు తిలకించి విజయవంతం చేయగలరు అని విజ్ఞప్తి చేస్తున్నాము.