భారత్ న్యూస్ ఢిల్లీ…..విమానం కాలిబూడిదైనా బ్లాక్ బాక్స్ సేఫ్.. ఎందుకంటే?
విమాన ప్రమాదం తర్వాత దానికి గల కారణాలు తెలుసుకునే బ్లాక్‌బాక్స్ కోసం అధికారులు వెతుకుతుంటారు. అయితే విమానం మొత్తం కాలిపోయినా బ్లాక్‌బాక్స్ సేఫ్‌గా ఉంటుంది. దీనిని టైటానియంతో తయారు చేసి, ఓ దృఢమైన పెట్టెలో భద్రపరుస్తారు. విమానం కూలిన నెలరోజుల వరకూ ఇది సిగ్నల్స్ పంపుతుంది. నీటిలో పడ్డా కూడా సిగ్నల్స్ ఇస్తుంది. అందులో ఉండే లొకేటర్ బీకాన్ ద్వారా బ్లాక్ బాక్స్‌ను అధికారులు సులభంగా గుర్తిస్తారు.
