నియోజక వర్గ ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపిన చల్లగుళ్ల శోభనాద్రి

భారత్ న్యూస్ ప్రతినిధి ::: నియోజక వర్గ ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపిన చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి,బొంగు రవికుమార్ ముదినేపల్లి లో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికని విజయవంతం చేసిన ఎన్.డీ.ఏ.కూటమి నాయకులకు, కార్యకర్తలకు,అధికారులకు,ప్రజలకు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నామని ముదినేపల్లి తెలుగు దేశం పార్టీ మండలాధ్యక్షుడు చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి,మండల తెలుగు దేశం పార్టీ కార్యదర్శి బొంగు రవికుమార్,కోడూరి శేషు బాబు ధన్యవాదాలు తెలియచేసారు.చల్లగుళ్ళ శోభనాద్రి చౌదరి మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, అధికారులకు తెలియచేసామన్నారు, ముదినేపల్లి మండల ప్రజలకు సమస్యలు వున్న ఎడల ముదినేపల్లి లోని ఎన్.డీ.ఏ.పార్టీ కార్యాలయం నందు అర్జీలు ఇచ్చి రికార్డులలొ నమోదు చేయించుకున్నచొ సంభందిత అధికారులకి తెలియ చేసి న్యాయం చేయించడానికి, పరిష్కారానికి చర్యలు తీసుకొంటామన్నారు, ప్రజలందరూ ఎన్.డీ.ఏ.కార్యాలయంలోని సేవలను వినియోగించుకోవాలన్నారు, ప్రజా సేవకి తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, బి.జే.పీ.పార్టీ నాయకులు,కార్యకర్తలు,జెనసేన నాయకులు,కార్యకర్తలు, అందరిని కలుపుకొంటూ,సంప్రదించి, ఎన్.డీ.ఏ.కూటమి ద్వారా ప్రజలకి అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించటానికి,అధికారులకి తెలియచేసి న్యాయ పరమైన చర్యలు తీసుకోటానికి దోహధపడుతుందని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియచేసారు