నేటి నుండి కొత్త విద్యా సంవత్సరంలోకి ప్రవేశించబోతున్న మిత్రులందరికీ శుభాకాంక్షలు.

భారత్ న్యూస్ గుంటూరు…..నేటి నుండి కొత్త విద్యా సంవత్సరంలోకి ప్రవేశించబోతున్న మిత్రులందరికీ శుభాకాంక్షలు.

ఈ విద్యా సంవత్సరం అత్యంత ఆనందంగా,
అభివృద్ధిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నాను.

భగవంతుడు మనకు అప్పగించిన బాధ్యతను పూర్తిగా నెరవేర్చే శక్తి యుక్తులు కూడా ఆయనే ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

చాలా రోజులు పాఠశాలకు దూరంగా ఉన్నారు కాబట్టి పిల్లలు దారిలో ఉండాలంటే మనం మొదటి పది రోజులు క్రమశిక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
రాగిజావ ఇచ్చే సమయంలోను, భోజనం సమయంలోను,
ఇంటర్వెల్ సమయంలోనూ కూడా ఒక 10 రోజులు అందరం సమిష్టి బాధ్యత తీసుకోవాలి.
అది ప్రధానోపాధ్యాయుడు లేదా వ్యాయామ ఉపాధ్యాయుడది మాత్రమే బాధ్యత కాదు.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా లోపం అనిపించేది క్రమశిక్షణ మాత్రమే. మన పాఠశాలల్లో ఏ చిన్న విషయంలో కూడా అలాంటి లోటు కనిపించకూడదు.

ప్రభుత్వ ఉద్యోగం వచ్చేవరకు అనేక ప్రయత్నాలు చేస్తాం, ప్రార్థనలు చేస్తాం .ఎక్కడో ఒక చోట ఉద్యోగం వస్తే చాలు అనుకుంటాం,
అడవుల్లో పనిచేయడానికైనా సిద్ధమే ఉనుకొంటాం.
తర్వాత తర్వాత వాళ్లతో వీళ్ళతో పోల్చుకొని మన సామర్థ్యాన్ని మనమే తగ్గించుకుంటాం.

మన చుట్టూ ఉన్న వారిలో బాగా కష్టపడే వారితోనే మనం ఎక్కువ పోల్చుకుందాం! ఎక్కువ పని చేద్దాం !

సామర్థ్యం లేక కాదు సంకల్పం లేక మన వ్యవస్థ కొంత దెబ్బతింటుంది.
దానిలో మనం కూడా భాగస్వాములం కాకూడదు. వ్యవస్థను బాగు చేయడంలో మనం భాగస్వాములం కావాలి.

స్టాఫ్ రూమ్ లో కంటే పిల్లల మధ్య ఎవరు ఎక్కువగా గడుపుతారో… వారు ఎక్కువ మానసిక ఆనందాన్ని పొందుతారు అనేది వాస్తవం.
అలా ఉండేవారు మానసికంగా ఎప్పుడు చిన్నవయసులోనే ఉంటారు.
నిరంతరం పిల్లల మధ్య ఉండటానికి ప్రయత్నం చేద్దాం వారిని చక్కదిద్దుదాం, తద్వారా భగవంతుడు మన కుటుంబాన్ని చక్కదిద్దుతాడు, ఆశీర్వదిస్తాడు.

🙏🌹నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు