భారత్ న్యూస్ రాజమండ్రి….షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు APPSC అలర్ట్
ఏపీలో షెడ్యూల్డ్ కులాలను గ్రూప్ 1, 2, 3 అని 3 గ్రూపులుగా సబ్ క్లాసిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్(OTPR) ఉన్న SC అభ్యర్థులు.. తమ షెడ్యూల్డ్ కుల గ్రూపును OTPRలో నమోదు చేయాలని కోరింది. కమిషన్ వెబ్సైట్ www.psc.ap.gov.in ని సందర్శించాలని సూచించింది.
రాబోయే జాబ్ నోటిఫికేషన్ల ఆన్లైన్ దరఖాస్తుకు ఇది తప్పనిసరి అని తెలిపింది.
