దంతేవాడలో సచిన్ టెండూల్కర్ కలల క్షేత్రాలు

భారత్ న్యూస్ అనంతపురం ..దంతేవాడలో సచిన్ టెండూల్కర్ కలల క్షేత్రాలు

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ మావోయిస్టుల కంచుకోట. ఈ దండకారణ్యం ఎప్పు డూ తూపాకీ శబ్దాలతో.. బాంబు పేలుళ్లతో.. ఆర్త నాదాలతో దద్దరిల్లిపోతుం టోంది. మావోయిస్టుల అడ్డాగా ఉన్న ఈ అభయా రణ్యం.. ఇప్పుడు శాంతి దిశగా పయనిస్తోంది.

దంతేవాడలోని కీలక ప్రాంతాలను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం… మావోలు లొంగిపోవడం… లేక ఎన్ కౌంటర్ లో మరణించడం తో ఆ ప్రాంతంలో ఇప్పుడి ప్పుడే సాధారణ పరిస్థి తులు నెలకొంటున్నాయి. ఇప్పుడు దంతేవాడలోని యువతను.. పిల్లలను మావో బాట పట్టకుండా ఉండేందుకు కేంద్రం క్రీడలను అస్త్రంగా చేసుకోనుంది.

క్రికెట్ మాస్టర్ సచిన్ ఆధ్వర్యంలో 50 మైదా నాలు సిద్ధమవుతున్నాయి. క్రికెట్ గాడ్ నేతృత్వంలో…. నక్సలిజంతో ప్రభావితమైన దంతేవాడ జిల్లా… ఇప్పు డు క్రీడల వైపు చూస్తోంది. క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలో దంతేవాడ జిల్లాలో 50 మైదానాలను నిర్మిస్తున్నారు.

ఎప్పుడూ బాంబుల శబ్దాలు, తుపాకీ మోతలు వినిపించే ఈ ప్రాంతంలో ఇప్పుడు పిల్లల నవ్వులు, ఆటలు, వ్యాయామాల మార్పు కనిపించనుంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాన్ దేశి ఫౌండేషన్‌తో కలిసి బస్తర్ ప్రాంతంలోని 50 గ్రామాల్లో క్రీడా మైదానాల నిర్మాణా న్ని ప్రారంభించారు.

ఈ మైదానాలు కేవలం ఆటల కోసం మాత్రమే కాదు, గ్రామీణ యువతకు శారీరక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను అందించడమే లక్ష్యంగా పనిచేయనున్నాయి. క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖో-ఖో, అథ్లెటిక్స్ వంటి క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు గ్రామస్తులే స్వయంగా నిర్మిస్తున్నారు. ఎలాంటి బయట కాంట్రా క్టర్లను పిలవకుండా, గ్రామ ప్రజలే మైదానాలు తయా రు చేసుకుంటున్నారు.

ప్రతి మైదానం ఒక మార్పుకు చిహ్నం’ అని ఫౌండేషన్ ప్రతినిధి దివ్య సింహా తెలిపారు. ఇవి గిరిజన సమాజాన్ని ప్రేరేపించడమే కాదు, పిల్లలకు కలలు కనే శక్తిని ఇస్తున్నాయన్నారు.