భారత్ న్యూస్ ఢిల్లీ….పాక్‌లో బలమైన నాయకత్వం ఉంది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్థాన్‌పై పొగడ్తలు గుప్పించారు. పాక్‌లో బలమైన నాయకత్వం ఉందన్న ఆయన.. ఈ విషయాన్ని కొందరు అంగీకరించరంటూ భారత్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే, ట్రంప్ భారత్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, కాల్పుల విరమణ గురించి మాట్లాడారు. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ సైనిక చర్య చేపట్టిన క్రమంలో, పాకిస్థాన్ తన శాంతి విజ్ఞప్తికి స్పందించిందని ట్రంప్ పేర్కొన్నారు.
