భారత్ న్యూస్ రాజమండ్రి….కుటుంబ విభేదాలపై లేఖ విడుదల చేసిన ముద్రగడ.
కూతురు క్రాంతిని ఉద్దేశించి లేఖ విడుదల చేసిన ముద్రగడ.
ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తోంది.
మా రెండు కుటుంబాలకు చాల ఏళ్ల క్రితమే మనస్పర్థలు వచ్చాయి.
చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక రగిలిపోతున్నారు.

నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్నకుమారుడే కారణం.
మా అబ్బాయిని దూరం చేస్తే వారి ఇంటికి చేరుతానని అనుకుంటున్నారు.
వయస్సు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యలు తప్ప వేరే సమస్యలు లేవు. నన్ను బంధించడం, మానసికంగా హింసించడం ఎవరితరం కాదు.
దమ్ముంటే కాపు రిజిర్వేషన్లు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయండి : ముద్రగడ పద్మనాభం