భారత్ న్యూస్ రాజమండ్రి…నేటి నుంచి టీచర్ల నిరవధిక నిరాహార దీక్ష
విజయవాడ :
ఏపీలో వెబ్ కౌన్సెలింగ్ వద్దని, మాన్యువల్ గానే కౌన్సెలింగ్ చేపట్టాలనే డిమాండ్ సోమవారం
నుంచి డిఈవో కార్యాలయాల ఎదుట ఉపాధ్యాయులు నిరవధిక నిరాహార దీక్షలు చేయనున్నారు.మంగళవారం మంగళగిరిలో విద్యాభవన్
ముట్టడికి జేఏసీ పిలుపునిచ్చింది. కాగా స్లాట్ల ప్రకారం 500 మంది చొప్పున కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆదివారం విద్యాశాఖ చెప్పగా
టీచర్లు తిరస్కరించారు.మాన్యువల్ తప్ప దేన్నీ అంగీకరించబోమని టీచర్లు తేల్చి చెప్పారు
