భారత్ న్యూస్ గుంటూరు…Jun 07, 2025,..Ammiraju Udaya Shankar.sharma News Editor…తహసీల్దార్‌పై కొడవలితో దాడి
తహసీల్దార్‌పై కొడవలితో దాడి
ఆంధ్రప్రదేశ్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయినవిల్లి కార్యాలయంలో విధుల్లో ఉన్న తహసీల్దార్ నాగలక్ష్మమ్మపై జోగిరాజుపాలేనికి చెందిన మీసాల సత్యనారాయణ అనే వ్యక్తి కొడవలితో దాడిచేసి గాయపరిచాడు. శుక్రవారం మద్యం మత్తులో ఉన్న సత్యనారాయణ తన చేతిసంచిలోని కొడవలిని తీసి తహసీల్దార్ పైకి విసరడంతో ఆమె చేతికి గాయమైంది. దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠినమైన సెక్షన్ల ద్వారా కేసు నమోదు చేయాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఎస్పీకి సూచించారు.
