.భారత్ న్యూస్ హైదరాబాద్….‘కాళేశ్వరం’ సమాచారమంతా వాళ్లిద్దరి వద్దే: ఈటల
కాళేశ్వరం కమిషన్ ఎదుట BJP ఎంపీ ఈటల రాజేందర్ విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారమంతా కేసీఆర్, హరీశ్‌రావు వద్దే ఉందన్నారు. ఇందులో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా లేదని చెప్పారు. ఆర్థిక శాఖకు అన్ని విషయాలు తెలియవని పేర్కొన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో నేనేమీ చేయలేదు.. నా దగ్గర ఏం లేదు. ప్రాజెక్టు రీ డిజైనింగ్ కోసం క్యాబినెట్ సబ్‌కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. దీనికి హరీశ్‌రావు ఛైర్మన్‌గా ఉన్నారు’’ అని ఈటల తెలిపారు.
