భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor.కృష్ణా జిల్లా పోలీస్
మసులా బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ట్రాఫిక్ మల్లింపు చర్యలు చేపట్టిన కృష్ణాజిల్లా పోలీస్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాకు తలమానికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మసూల బీచ్ ఫెస్టివల్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజానీకానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండ కృష్ణాజిల్లా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సుదూర ప్రాంతాల నుండి మంగినపూడి సముద్ర తీరాన్ని సందర్శించే వారు ఏ ఏ మార్గాల ద్వారా రావాలి, ఏ ప్రదేశంలో ప్రార్ధన చేసుకోవాలి తిరిగి ఏ మార్గాలలో వెళ్లాలి అనే విషయాలు తెలియజేశారు.
▪️ట్రాఫిక్ నియంత్రణకు ONE WAY ఏర్పాటు చేయడమైనది. ప్రజలు గమనించగలరు.
▪️ఈ ట్రాఫిక్ ఆంక్షలు 05-06-2025 నుండి 08-06-2025 వరకు అమల్లో ఉంటాయి.
మంగినపూడి బీచ్ కు చల్లపల్లి, విజయవాడ, గుడివాడ వైపు ల నుండి వచ్చు వారు మచిలీపట్టణం – ఛిలకలపుడి రింగ్ – చిలకలపూడి రైల్వే గేటు – SVH ఇంజనీరింగ్ కాలేజీ — తపసిపూడి — సిరివేల్లపాలెం, బడ్డీల సెంటరు — దత్త ఆశ్రమము — మంగినపూడి బీచ్ చేరుకొని నిర్దేశించిన Parking Place లలో అనగా బీచ్ రోడ్ కు ఎడమ వైపు Car లు, కుడివైపు Bikes, అదే విదముగా Bus లు మరియు Lorries ఎడమ వైపు గిరిపురం ఊరి చివర గల Parking Place లలో తమ వాహనములను పార్క్ చేసుకొని బీచ్ లోనికి వెళ్ళవలెను.RTC బస్సులు ద్విచక్ర వాహనాలు పార్కింగ్‌కి ముందు భాగంలో తిప్పుకొని వచ్చిన మార్గంలోనే వెళ్ళవలెను.
V.I.P. వెహికల్స్ Gate Way of Amaravathi Arch కి కుడి వైపు గల V.I.P. Parking Place నందు పార్క్ చేసుకోవలెను.
భీమవరం, కృతివెన్ను, బంటుమిల్లి వైపు ల నుండి వచ్చు వారు పెదపట్నం — కానూరు–తాళ్ళపాలెం– బడ్డీల సెంటరు మంగినపూడి బీచ్ కు చేరుకొని పైన తెలిపిన పార్కింగ్ ప్లేస్ లో తన వాహనాలను నిలిపి బీచ్ లోనికి పోవలెను..
కార్, ఆటో లలో వచ్చిన వారు తిరిగి వెళ్ళేటప్పుడు, బీచ్ వద్ద పార్కింగ్ ప్లేస్ నుండి గిరిపురం — H.సత్తేనపాలెం — వాటర్ ట్యాంక్ జంక్షన్ నుండి ఎడమ వైపుకు తీసుకొని, కెనరా బ్యాంకు పక్కనుండి, కంసాలివారిపాలెం — G.సత్తేనపాలెం — గోకవరం — కాకర్లముడి పాలెం — నందమూరు గ్రామాల మీదుగా NH-216 కు చేరి అక్కడ నుండి మచిలీపట్టణం, విజయవాడ వైపుకు వెళ్లువారు ఎడమవైపుగా భీమవరం వెళ్ళవలెను.
టూరిస్ట్ బస్సు లు మరియు లారీలలో వచ్చిన వారు పార్కింగ్ ప్లేస్ నుండి గిరిపురం గ్రామం బయట నుండి ఉప్పు కొటారులు H.సత్తేనపాలెం వద్ద కుడి వైపు టర్నింగ్ తీసుకొని, సత్రవపాలెం — బొట్లగూడెం — సంత మార్కెట్ రోడ్ — G.సత్తేనపాలెం — గోకవరం — కాకర్లముడి పాలెం — నందమూరు NH-216 కు చేరి అక్కడ నుండి మచిలీపట్టణం, విజయవాడ వైపుకు వెళ్ళు వారు ఎడమవైపుకు, భీమవరం వైపు వెళ్ళు వారు కుడివైపుకు వెళ్ళవలెను.

Two Wheeler (Bikes/Scooters) పై వచ్చిన వారు మచిలీపట్టణం వైపు వెళ్ళుటకు, పార్కింగ్ ప్లేస్ నుండి తిన్నగా బడ్డీల సెంటరు మీదుగా ఎడమ వైపు గా మచిలీపట్టణం వెళ్ళవలెను.
Two Wheeler (Bikes/Scooters) పై వచ్చిన వారు భీమవరం, బంటుమిల్లి, కృతివెన్ను రూట్ ల వైపు వెళ్ళు వారు కూడా పార్కింగ్ ప్లేస్ నుండి తిన్నగా బడ్డీల సెంటరు మీదుగా ఎడమ వైపు గా వెళ్లి గోకవరం అడ్డ రోడ్ మీదుగా గోకవరం, కాకర్లముడి పాలెం, నందమూరు గ్రామాల మీదుగా NH-216 కు చేరి అక్కడ నుండి కుడి వైపు నకు వెళ్ళవలెను.
Beach కు వచ్చు వారు పై Traffic Diversion లను గమనించి, తప్పకుండా divertion చేసిన రూట్ల లో మీ మీ వాహనములలో ప్రయాణించి Police Department వారికి సహకరించవలసినదిగా తెలిపరచు చున్నాము.
ఇట్లు ,
ఆర్.గంగాధరరావు IPS, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కృష్ణాజిల్లా.