ఇకపై BRSకు దూరంగా కవిత!

..భారత్ న్యూస్ హైదరాబాద్…..ఇకపై BRSకు దూరంగా కవిత!

TG: కల్వకుంట్ల కవిత ఇకపై BRSకు దూరంగా ఉండబోతున్నట్లు ఇవాల్టి ప్రెస్ మీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. KCRకు రెండు కళ్లలా BRS, తెలంగాణ జాగృతి పని చేస్తాయని ప్రకటించారు. దీన్నిబట్టి కవిత జాగృతి వేదిక గానే రాజకీయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కవిత తన ప్రసంగంలో KCRకు ప్రాధాన్యత ఇచ్చారు. KCRపై ఈగ వాలినా ఊరుకోమని CM రేవంత్ను హెచ్చరించారు. అలాగే కాంగ్రెస్, బీజేపీలను గోదావరి జలాల విషయంలో టార్గెట్ చేశారు.