భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…ఎం డి యు వాహనాలు తొలగింపుతో ఉపాధి కోల్పోయిన నిరుద్యోగ యువకులు
- మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించిన లంచ్ మోషన్ మూవ్ చేసిన రాజమండ్రి ఎం డి యు ఆపరేటర్లు
- మూడు వారాలు సమయం కోరిన ప్రభుత్వం
- ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో రోడ్డున పడ్డ 18,500 కుటుంబాలు
- 2027 వరకు కాల పరిమితి ఉన్నప్పటికీ ఎం డి యు వ్యాన్లను తొలగించిన కూటమి ప్రభుత్వం
- రేషన్ షాపులను కార్యకర్తలకు, సానుభూతిపరులకు కేటాయించిన కూటమి ప్రభుత్వం
- పిడిఎస్ బియ్యాన్ని అక్రమ రవాణాకు తెరలేపిన టిడిపి నాయకులు
రాజమహేంద్రవరం మే 30 :
ఎం డి యు వ్యాన్ నిర్వహణ సంబంధించి వాహనం ఆపరేటర్ కు నెలకు 18,వేలు, హెల్పర్ కు రూ 6,000, పెట్రోల్ ఖర్చులు 3,000, ఇన్సూరెన్స్ సంబంధించి ప్రతి ఏడాది 10,000 కట్టే విధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2027 వరకు సమయం ఉంది
జూన్ 1 తేదీ నుంచి తెలుగుదేశం కార్యకర్తల ను డీలర్లగా రేషన్ బియ్యం రేషన్ డిపోలో ప్రజలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచితం నిర్ణయం వలన రాష్ట్రవ్యాప్తంగా 18,500 కుటుంబాలు రోడ్డున పడ్డాయి 9,300 మంది నిరుద్యోగులు ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వలన తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని పలువురు ఎండియు ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం డిపోల ద్వారా పంపిణీ చేస్తే పిడిఎస్ బియ్యాన్ని అక్రమ రవాణా చేసేందుకు ఆస్కారం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టును ఆశ్రయించిన ఎం డి యు ఆపరేటర్లు
మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో రాజమండ్రి కి చెందిన ఎం డి యు ఆపరేటర్లు తమకు న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించి లంచ్ మోషన్ మూవ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 2027 వరకు ఎండీయూ వ్యాన్లు నిర్వహించుకునేందుకు అనుమతులు ఉన్నాయని హై కోర్టుకు సమర్పించిన లంచ్ మోషన్ పిటిషన్ లో ఆపరేటర్లు తానేటి రామకృష్ణ , ధనుంజయ్ కుమార్ తదితరులు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ 18,500 కుటుంబాల రోడ్డును పడ్డాయని తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. చాలీచాలని జీతాలతో వ్యాన్లు నిర్వహణ భారంగా మారి అప్పుల పాలయ్యామని తెలిపారు. ఇప్పటికే బ్యాంకులకు చెల్లించాల్సిన రూ 3 లక్షల కు పైగా సొమ్ములు చెల్లించామని, ఇంకా రూ 1, లక్ష 90, వేలు చెల్లించాల్సి ఉందని అన్నారు. ఈ తరుణంలో వ్యాన్ల ద్వారా రేషన్ సరఫరాలు నిలుపుదల చేస్తే మరింత అప్పులు పాలు అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటమి ప్రభుత్వం దయతో ఎండీయూ వ్యాన్లు పునరుద్ధరించాలని కోరారు. ఎం డి యు ఆపరేటర్లు కోర్టును ఆశ్రయించిన తో మూడు వారాల గడువు ను ప్రభుత్వం కోరింది.
