వచ్చే నెల 1వ తేదీన రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ.. సమయం ఇదే..!

భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…వచ్చే నెల 1వ తేదీన రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ.. సమయం ఇదే..!

65 సంవత్సరాల దాటిన వారికి ఇంటి వద్దకే రేషన్

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీని వచ్చే నెల(జూన్) 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా చేయనుంది. ఈ రేషన్ సరుకుల పంపిణీకి సర్వం సిద్ధం అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

గతంలో ఎండీయూ వాహనం ఎప్పుడు వస్తుందో వెళుతుందో తెలియని దుస్థితి ఉందని తెలిపారు. ఈ క్రమంలో రేషన్ కార్డుదారులు వాహనం కోసం రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఉందని ఇపుడు కార్డుదారులకు ఆ కష్టాలు ఉండవని చెప్పారు. నెలలో ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.

65 సంవత్సరాలు దాటిన ఒంటరి వృద్ధులు, వికలాంగులు, భార్యభర్తలు ఇద్దరు వృద్ధులైన వారి జాబితాలు రేషన్ షాపుల వారిగా సిద్ధం చేశామని వారికి 1 నుంచి 5వ తేదీలోగా డీలర్ ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు ఇస్తారని చెప్పారు. ఇల్లు మారి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారికి కూడా పోర్టబిలిటీ విధానం ద్వారా సమీప రేషన్ దుకాణంలో రేషన్ పొందవచ్చని తెలిపారు. రేషన్ దుకాణాల్లో అవినీతి జరగకుండా ప్రభుత్వం సరికొత్త యాప్ రూపొందించినట్లు వెల్లడించారు. ఈ యాప్ లో డీలర్ వివరాలు ఫోటోలతో సహా వస్తాయన్నారు. సరుకు ఎంత వచ్చింది. కార్డుదారులకు ఎంత పంపిణీ చేశారనే వివరాలు, రేషన్ దుకాణం వద్ద జనం ఎక్కువ మంది ఉన్నా వెంటనే ఈ యాప్ ద్వారా తెలుస్తుందన్నారు.