న్యాయమూర్తుల బదిలీ ప్రతిపాదనలు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

భారత్ న్యూస్ హైదరాబాద్….న్యాయమూర్తుల బదిలీ ప్రతిపాదనలు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

11 హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తుల బదిలీ ప్రతిపాదనలు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం

కర్ణాటక హైకోర్టు నుంచి జస్టిస్ సుమలత, జస్టిస్ లలిత కన్నెగంటిలను తెలంగాణ హైకోర్టుకు బదిలీ ప్రతిపాదన

పాట్నా హైకోర్టు నుంచి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ప్రతిపాదించిన సుప్రీం కొలీజియం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్‌ని కోల్‌కతా హైకోర్టుకు బదిలీ

మద్రాస్ హైకోర్టు నుంచి జస్టిస్ భట్టు దేవానంద్‌ను తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ ప్రతిపాదన