పేలుళ్ల కుట్ర.. ముగిసిన మూడో రోజు విచారణ,

భారత్ న్యూస్ శ్రీకాకుళం…పేలుళ్ల కుట్ర.. ముగిసిన మూడో రోజు విచారణ

ఆంధ్రప్రదేశ్ : విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు విచారణ మూడో రోజు ముగిసింది. సిరాజ్, సమీర్ వాంగ్మూలాన్ని ఢిల్లీ NIA అధికారులు రికార్డు చేశారు. విచారణలో భాగంగా పేలుళ్ల కోసం ఇద్దరూ హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. సౌదీ నుంచి అందిన నిధులు, ఉగ్రవాద లింకులు, పేలుళ్ల కుట్ర, విదేశీ కాల్స్, సోషల్ మీడియా అకౌంట్లు సహా పలు అంశాలపై NIA అధికారులు నేటి విచారణలో ఆరా తీశారు…..