భారత్ న్యూస్ శ్రీకాకుళం….రేపు చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం మూసి వేయబడును
రేపు సంభవించనున్న చంద్రగ్రహణం నేపథ్యంలో దేవస్థానంలో ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి ఆలయ ద్వారాలు తాత్కాలికంగా ముసివేయబడును. గ్రహణ కాలములో ఎలాంటి దర్శనాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడవు. గ్రహణం ముగిసిన అనంతరం సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, తిరిగి మరుసటి రోజు ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనము పూజా కార్యక్రమాలు యధావిధిగా కల్పించబడును.
