అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ వర్సిటీ

భారత్ న్యూస్ అమరావతి..అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ వర్సిటీ

అమరావతి :

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకో సిస్టమ్, శిక్షణ కేంద్రాల అభివృద్ధి కోసం ఐటీ శాఖ తాజాగా జీవో జారీ చేసింది. ఎని విడియా (Nvidia) సహకారంతో ‘ఏఐ లివింగ్ ల్యాబ్స్’ పేరుతో ఈ వర్సిటీని నెలకొల్పుతున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచే దీని కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం.