నరసరావుపేట నుంచి కోటప్పకొండకు బస్సుల టికెట్ ధరలు ఇలా..

భారత్ న్యూస్ విశాఖపట్నం..నరసరావుపేట నుంచి కోటప్పకొండకు బస్సుల టికెట్ ధరలు ఇలా..

మహాశివరాత్రి జాతర దృష్ట్యా భక్తుల కోసం పల్నాడు జిల్లావ్యాప్తంగా 618 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) అజిత కుమారి తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నరసరావుపేట నుంచి కోటప్పకొండ దిగువకు రూ.25, అక్కడి నుంచి ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి రూ.30 చొప్పున ధరలు నిర్ణయించారు. నేరుగా నరసరావుపేట నుంచి కొండపైకి వెళ్లే భక్తులకు రూ.55 టికెట్ ధరగా ఖరారు చేశారు.