భారత్ న్యూస్ రాజమండ్రి…నారా లోకేష్ చారిత్రాత్మక ‘యువగళం’ పాదయాత్రకు మూడేళ్లు – అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రత్యేక పూజలు
అవనిగడ్డ:ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మలుపు తిప్పి, కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన యువనేత, రాష్ట్ర ఐటీ, విద్య మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభమై నేటికి మూడు ఏళ్లు పూర్తయిన సందర్భంగా అవనిగడ్డలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లంకమ్మ అమ్మవారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, అణగారిన వర్గాల గొంతుకగా 2023 జనవరి 27న కుప్పం గడ్డపై ప్రారంభమైన ఈ పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు అధికార గర్వంతో విర్రవీగిన నాటి పాలకుల అరాచకాలను, వ్యవస్థల విధ్వంసాన్ని నారా లోకేష్ స్వయంగా చూసి యువతలో కోల్పోయిన ఆశలను తిరిగి చిగురింపజేస్తూ, సామాన్యుడి కష్టాన్ని తన కష్టంగా భావించి సాగిన ఈ ప్రయాణం గాజువాకలోని అగనంపూడి వద్ద విజయవంతంగా ముగిసిందన్నారు . ఈ పాదయాత్ర ద్వారా లక్షలాది మందికి ధైర్యాన్ని ఇచ్చి, వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పునాది వేశారని నాయకులు లోకేష్ అని కొనియాడారు.ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గ నాయకులు లంకమ్మ అమ్మవారిని దర్శించుకుని, రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న లోకేష్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పార్టీ నాయకులు మండలి రామమోహనరావు,విశ్వనాథపల్లి పాప,బండే రాఘవ,బండే కనకదుర్గ,ఘంటసాల రామమోహనరావు,దాసినేని శ్రీనివాసరావు,దాసినేని సాంబయ్య,మెగవత్తు గోపి,చెన్ను గాంధీ,బచ్చు రమణ,మేరుగు సోమిరెడ్డి,మడివాడ రత్నారావు,చెన్ను బాబూరావు,కంచర్ల ఆనంద్,కొండవీటి గోవింద్,నాగిడి రాంబాబు,షేక్ బాబావలి,మేరుగు రంగనాథ్,నలుకుర్తి రాము,అవనిగడ్డ రమేష్,గాలం శ్రీను,బట్టు నరసింహారావు,మైలా హరిబాబు తదితరులు పాల్గొన్నారు
