ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా బంద్?

భారత్ న్యూస్ గుంటూరు….ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా బంద్?

కూటమి ప్రభుత్వం ఆలోచనల అడుగులు

ఆంధ్రప్రదేశ్లో 16 ఏళ్లలోపు పిల్లల కోసం సోషల్ మీడియా నిషేధం విధించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఆస్ట్రేలియా అమలు చేస్తున్న ‘అండర్-16’ చట్టాన్ని అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ దావోస్ వేదికగా వెల్లడించారు. ఈ నిబంధన అమలైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్ల వాడకంపై కఠిన ఆంక్షలు ఉంటాయి. నిబంధనలు పాటించని టెక్ సంస్థలపై భారీ జరిమానాలు విధించేలా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.