భారత్ న్యూస్ డిజిటల్ : అమరావతి:
శ్రీకాకుళం జిల్లా పోలీసు
“2025 సంవత్సరానికి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు ఉద్యోగులకు ప్రశంస పత్రాల ప్రదానం
జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చేతుల మీదుగా సత్కారం
శ్రీకాకుళం : జిల్లాలో విధి నిర్వహణలో విశిష్ట ప్రతిభ, అంకితభావం, క్రమశిక్షణతో సేవలందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి 2025 సంవత్సరానికి గాను ప్రశంస పత్రాలు ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ కె. మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు సంయుక్తంగా ఈ ప్రశంస పత్రాలను అందజేశారు.ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజాసేవ కార్యక్రమాల్లో విశేష కృషి చేసిన పోలీసు సిబ్బందిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ జిల్లా పోలీసు శాఖకు గౌరవాన్ని తీసుకువచ్చిన సిబ్బంది సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అదే విధంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ — అంకితభావంతో పనిచేసే సిబ్బందే పోలీసు వ్యవస్థకు బలం అని, ఇలాంటి ప్రోత్సాహాలు మరింత ఉత్తమ సేవలకు ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు..
ప్రశంస పత్రాలు అందుకున్న వారు. సి హెచ్ వివేకానంద – ఎస్డీపీఓ, శ్రీకాకుళం,కె. పైడపు నాయుడు – ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, శ్రీకాకుళం రూరల్ సర్కిల్
శ్రీ జి. రంజిత్ – ఎస్‌ఐ, పోలాకి పీఎస్, పి. మాధవరావు – పీసీ 1589, సీసీఎస్, శ్రీకాకుళం
జఎస్. రవి కుమార్ – పీసీ 838, ఎచ్చర్ల పీఎస్,ఎం. దాలి నాయుడు – పీసీ 1829, సరవకోట పీఎస్,ఎస్. ఉషా కిరణ్ – పీసీ 2058, కాశీబుగ్గ పీఎస్,ఎం. నీలకంఠం – పీసీ 2139, కాశీబుగ్గ పీఎస్,ఎస్. కోదండ రావు – హెచ్‌సీ 854, కంచిలి పీఎస్,ఎన్. రాధాకృష్ణ – పీసీ 310, సారుబుజ్జిలి పీఎస్
,కె. రాజశేఖరం – పీసీ 628, శ్రీకాకుళం II టౌన్ పీఎస్,వి. గోపీ కృష్ణ – పీసీ 2202, శ్రీకాకుళం II టౌన్ పీఎస్,ఎం. సింహాచలం – పీసీ 356, ఇచ్చాపురం టౌన్ పీఎస్,జె. రాంప్రసాద్ – పీసీ 2140, ఇచ్చాపురం టౌన్ పీఎస్,ఎస్. రమణారావు – హెచ్‌సీ 117, డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్,జె. శ్రీనివాసరావు – పీసీ 2225, టాస్క్ ఫోర్స్,కె. హేమసుందర్ రావు – హెచ్‌సీ 1348, డీసీఆర్‌బీ,ఎం. వాసు నాయుడు – పీసీ 2107, ఐటీ కోర్,జి. తిరుపతి రావు – పీసీ 528, డ్రోన్ డ్యూటీ, కె. బాలకృష్ణ – ఏ–3 సీట్, డీపీఓ, టి. సురేష్ – ఏ–7 సీట్, డీపీఓ,ఎం.డి. హఫీజా – డబ్ల్యూపీసీ 2390, మహిళా యూపీఎస్,వై. వెంకటేశ్వర రావు – ఏఆర్‌ఎస్‌ఐ 447, డీఏఆర్బి.జె. నాయుడు – ఏఆర్‌హెచ్‌సీ 1004, ఎంటీ వింగ్, డీఏఆర్,బి. శేషిధర్ – ఏఆర్‌హెచ్‌సీ 1001, డాగ్ స్క్వాడ్, డీఏఆర్
శ్రీ జె. జనార్దన రావు – ఎస్‌టిఎఫ్ పీసీ 1970, డీఏఆర్, కె. అచ్చెన్నాయుడు – పబ్లిక్ ప్రాసిక్యూటర్, 4వ ఏడీజే కోర్టు, ఎం. అప్పలరాజు – హోమ్ గార్డు, శ్రీకాకుళం జిల్లా

ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని అభినందనలు తెలిపారు.