మా తెనాలి లో.కూలీ పనిచేసుకొనే వారి ఇంట్లో 1.5 కోట్ల వెండి కోటిన్నర బంగారం , 5.65 లక్షల డబ్బు దొరికింది..

భారత్ న్యూస్ గుంటూరు….మా తెనాలి లో.కూలీ పనిచేసుకొనే వారి ఇంట్లో 1.5 కోట్ల వెండి కోటిన్నర బంగారం , 5.65 లక్షల డబ్బు దొరికింది..

తెనాలి లో కూలీ లు కూడా కోటీశ్వరులే 😂😂

కూలీ చేసుకునే వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి, నగదు బయటపడటం కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన సోదాల్లో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5.65 లక్షల నగదు దొరికాయి. తన అల్లుడే వీటిని దాచుకున్నాడని వృద్ధురాలు చెప్పడంతో.. పోలీసులు అతని ఇంటికి వెళ్లారు.. కానీ అప్పటికే పారిపోయాడు.
గుంటూరు జిల్లా తెనాలిలో రోజువారీ కూలి చేసుకునే వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి, నగదు బయటపడటం కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన సోదాల్లో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5.65 లక్షల నగదు దొరికాయి. తన అల్లుడే వీటిని దాచుకున్నాడని వృద్ధురాలు చెప్పడంతో.. పోలీసులు అతని ఇంటికి వెళ్లారు.. కానీ అప్పటికే పారిపోయాడు.

గుంటూరు జిల్లా తెనాలిలో రోజువారీ కూలి పనులు చేసుకునే ఒక వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులు బయటడ్డాయి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం బాలాజీరావుపేట సమీపంలోని మహేంద్ర కాలనీలో పేరిబోయిన గురవమ్మ అనే వృద్ధురాలు ఒక చిన్న రేకుల ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆమె ఇంట్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌కు రైస్ పుల్లింగ్ జరుగుతోందన్న సమాచారం వచ్చింది. వెంటనే డీఎస్పీ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురవమ్మ ఇంట్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5.65 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు, బంగారం, వెండి దొరకడం కలకలం రేపింది.