నగరిలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

భారత్ న్యూస్ రాజమండ్రి…నగరిలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Ammiraju Udaya Shankar.sharma News Editor…నగరాల్లో భారీ స్వీపింగ్ యంత్రాలను కూడా కొనుగోలు చేసి వినియోగిస్తున్నాం

మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు తన చివరి శ్వాస వరకూ ప్రజల కోసం సేవ చేశారు

ఎన్టీఆర్ పిలుపు అందుకుని ప్రజా జీవితంలోకి వచ్చిన ఆయన నిరంతరం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేశారు

ఏడాది క్రితం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర ఓ ఉద్యమంగా ప్రారంభించాం

ప్రతీ నెలా మూడో శనివారం ప్రత్యేకమైన థీమ్ తో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడుతున్నాం

స్వచ్ఛాంధ్ర అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇది మన జీవన విధానం కావాలి

ప్రతీ నెలా మొదటి తారీఖున పేదల సేవలో కార్యక్రమం ద్వారా పెన్షన్ల పంపిణీ చేస్తున్నాం

ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సేవలో కార్యక్రమాన్ని పెట్టాం

కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసి చూపించింది

స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆడపడుచులు ఉచితంగా ఎక్కడికైనా వెళ్లగలుగుతున్నారు

ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను అక్కచెల్లెళ్ల సంక్షేమం కోసమే ఇస్తున్నాం

ఎన్టీఆర్ భరోసా ద్వారా ఏడాదికి రూ.33 వేల కోట్లను పంపిణీ చేస్తున్నది కూటమి ప్రభుత్వమే

పీల్చేగాలి, తినేతిండి, తాగేనీరు కాలుష్య రహితంగా ఉండాలి.

చెడు ఆలోచనలు పెట్టుకుని నేరస్తులు రాజకీయాలు చేసి రాష్ట్రానికి భవిష్యత్ లేకుండా చేశారు

దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు

గతంలో జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపట్టి స్వచ్ఛత కోసం పనిచేసాం

పరిశుభ్రత విషయంలో మన అందరి ఆలోచనలూ మారాలి.

ఇల్లు ఒక్కటే కాదు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి

రూ.573 కోట్లతో స్వచ్ఛాంధ్ర కోసం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశాం

110 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ల ఏర్పాటుకు రూ.510 కోట్లు వ్యయం చేస్తున్నాం

కంపోస్ట్ తయారీ కోసం డస్ట్ బిన్ లను కూడా ఇస్తున్నాం

గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ఇ-ఆటోలు, ట్రై సైకిళ్లు, పుష్ కార్డులను ఇచ్చాం

గత ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పట్టణ ప్రాంతాల్లో వదిలేసి వెళ్లిపోయింది

తద్వారా భూమి, భూగర్భజలాలు, వాయు కాలుష్యం పెరిగిపోయింది.

ఇప్పుడు ఆ వ్యర్ధాలన్నీ తొలగించి మళ్లీ శుభ్రమైన పరిస్థితులు తీసుకువస్తున్నాం

112 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పూర్తిగా తీసేసి పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తాం

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ 100 శాతం చెత్త సేకరణ చేపట్టేలా కృషి చేస్తున్నాం

వ్యర్ధాల నుంచి విద్యుత్ తయారు చేసే యూనిట్లు 4 ఉన్నాయి. రాజమండ్రి, విజయవాడలలోనూ మరో రెండు ఏర్పాటు చేయబోతున్నాం

వీటితో పాటు కాంపోస్టు ఎరువు తయారీ కోసం కూడా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టాం

ప్లాస్టిక్, ఇ-వేస్ట్ లను సేకరించేందుకు 130 స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేశాం

2026 మార్చి నాటికి 660 స్వచ్ఛ రథాలను రాష్ట్రవ్యాప్తంగా తీసుకువస్తాం

పాఠశాలల్లో విద్యార్ధులు పరిశుభ్రంగా ఉండడానికి ముస్తాబు అనే వినూత్న కార్యక్రమం చేపట్టాం

ఈ చర్య ద్వారా విద్యార్ధులకు ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది