నేటి నుండి వాహనాల షో రూంల (డీలర్ల) వద్ద నుండే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ – రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

భారత్ న్యూస్ హైదరాబాద్….నేటి నుండి వాహనాల షో రూంల (డీలర్ల) వద్ద నుండే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ – రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

రవాణా శాఖ లో నేటి నుండి మరిన్ని సంస్కరణలు అమలవుతున్నాయి..

కొత్తగా వాహనం కొన్న వాహనదారుడు రిజిస్టేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేదు..

ఎక్కడ వాహనం కొంటే అక్కడ షో రూమ్ ల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ చేయబడుతుంది..

వాన శాఖలో అన్ని రకాల సేవలు ఆన్లైన్ లోనే చేసే విధంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి

తెలంగాణ ప్రభుత్వం సారథి లో చేరింది… దీని ద్వారా రవాణా సేవలు సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి

రవాణా శాఖ ఈవి పాలసీ,స్క్రాప్ పాలసీ, తీసుకొచ్చింది.. రవాణా శాఖ అనేక సంస్కరణలు తీసుకొచ్చి రవాణా సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చింది