యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐఏఎస్–ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐఏఎస్–ఐపీఎస్ అధికారుల ఆదర్శ వివాహం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వివాహం ఆదర్శంగా నిలిచింది.
చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎలాంటి ఆడంబరం లేకుండా అధికారులు రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.

చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారి శేషాద్రిని రెడ్డిని, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తుండగా, శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం ఐఏఎస్ శిక్షణలో ఉన్నారు.

సాధారణ ప్రజలకు ఆదర్శంగా నిలిచే విధంగా ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా జరిగిన ఈ వివాహానికి పలువురు ఉన్నతాధికారులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.