విజయవాడలో రెచ్చిపోతున్న గుంటూరుకు చెందిన రౌడీషీటర్ చోటు దాదా

భారత్ న్యూస్ గుంటూరు….విజయవాడలో రెచ్చిపోతున్న గుంటూరుకు చెందిన రౌడీషీటర్ చోటు దాదా..

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ.

గుంటూరు జిల్లాకు చెందిన ఓ రౌడీషీటర్ ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది.. సామాన్య ప్రజలపై, వ్యాపారస్తులపై దాడులకు పాల్పడుతూ రెచ్చిపోతున్నాడు. ఈ రౌడీ షీటర్ చోటు దాదా విజయవాడ రెండవ పట్టణం నవరంగ్ థియేటర్ వద్ద మహదేవ్ బైక్ యాక్సెసరీస్ దుకాణంలో మెకానిక్ గా పనిచేస్తున్నాడు . ద్విచక్ర వాహనాలు రిపేర్ చేయించుకోవడానికి వచ్చిన వ్యక్తులు నగదు కాస్త చూసి తీసుకోండి అనే వాహనదారులపై దాడికి దిగడమే కాకుండా ఆపడానికి వచ్చిన అక్కడి తోటి వ్యాపారుల పై కూడా దాడికి తెగబడుతున్నాడని వాహనదారులు వాపోతున్నారు. స్థానిక వ్యాపారస్తులు తెలిపిన వివరాల ప్రకారం నవరంగ్ థియేటర్ వద్ద మహదేవ్ బైక్ యాక్సిరేస్ దుకాణం ఉంది. అక్కడకు వాహనాలు రిపేర్ చేయించుకోవడానికి వస్తున్న వాహనదారులపై ఈ రౌడీ షీటర్ చోటు దాదా వాహనదారులపై రెచ్చిపోవడమే కాకుండా తోటి వ్యాపారస్తులపై కూడా దాడులకు తెగబడుతున్నాడని తోటి వ్యాపారస్తులు వాపోతున్నారు. అయితే మహదేవ్ దుకాణం యాజమాన్యం కూడా ఈ రౌడీ షీటర్ చోటు దాదాకు అండగా నిలవడంతో రౌడీ షీటర్ ఆగడాలు మరి హద్దు మీరుతున్నాయని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తోటి మెకానిక్ పై విచక్షణారహితంగా దాడి చేసిన కేసు రెండవ పట్టణం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యి కోర్టు చుట్టూ వాయిదాలకు తిరుగుతున్నాడని కొంతమంది వ్యాపారస్తులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రౌడీ షీటర్ చోటు దాదా మద్యం మత్తులో వ్యాపారుతులపై రెచ్చిపోతు బెదిరిస్తున్న ఘటనను అక్కడున్న వారు గమనించి ఫోన్లో వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇకనైనా ప్రజలను వ్యాపరస్తులను ఇబ్బందులకు గురిచేస్తున్న రౌడీ షీటర్ పై పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి వ్యాపారస్తులు ప్రజలు కోరుతున్నారు