పేటలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు

భారత్ న్యూస్ విజయవాడ…పేటలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు..

చిలకలూరిపేట:మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని, జనవరి 18వ తేదీ నుంచిచిలకలూరిపేటలో జాతీయ స్థాయిలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. బుధవారం ఈ పోటీల నిర్వహణకు సంబంధించి చిలకలూరిపేట గోల్కొండ గార్డెన్స్‌లో భూమి పూజా కార్యక్రమాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ, రైతాంగం కష్టాలను మరచిపోయే విధంగా కన్నుల పండుగగా ఈ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉండబోతున్నాయని తెలిపారు.పాల పళ్ళ వయస్సు నుండి పెద్ద సైజు, సీనియర్ వర్గాల వరకు విభాగాల వారీగా పోటీలు జరుగనున్నాయని చెప్పారు.గోల్కొండ గార్డెన్స్ వేదికగా 7 రోజులపాటు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.రాష్ట్ర నలుమూలల నుంచి మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా రైతులు తమ ఎడ్లతో ఈ బల ప్రదర్శనల్లో పాల్గొననున్నారని, విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.