భారత్ న్యూస్ గుంటూరు….కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి సురేష్ కల్మాడి కన్నుమూశారు. ఆయన వయస్సు 81 సంవత్సరా లు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా . ఈ తెల్లవారుజామున 3:30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఆయన మృతి పట్ల పలు వురు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్రమంత్రు లు సంతాపం వ్యక్తం చేశారు.సురేష్ కల్మాడి స్వరాష్ట్రం.. మహారాష్ట్ర లోని పుణే. మూడుసార్లు పూణే నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
1996, 2004, 2005 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, ఘన విజయం సాధించారు. మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు. రైల్వే సహాయ మంత్రిగా చిరస్మరణీయ సేవలను అందించారు. భారత ఒలింపిక్ అసోసియేషన్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. రాజకీయ, క్రీడా రంగాలలో కీలక పాత్ర పోషించారు.
జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ లో సుదీర్ఘ కాలం పాటు సేవలను అందించారు.సురేష్ కల్మాడి భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి పుణెలోని ఆయన నివాసానికి తరలించారు.

పార్టీ నాయకులు, ఆయన అభిమానుల సందర్శనార్థం ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంచుతారు. అనంతరం నవీపేట్‌లోని వైకుంఠ స్మశానవాటికలో మధ్యాహ్నం 3:30 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయ న మృతి పట్ల పలువురు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్రమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు.