భారత్ న్యూస్ డిజిటల్: నల్గొండ:
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
బాల్యం అమూల్యమైనది….
….లండన్ సోలిహుల్ కౌన్సిలర్ శేషేంద్ర శేషు భట్టర్.
స్టేట్ టీచర్స్ యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రాథోడ్.
ఈ రోజు నల్గొండ పట్టణంలోని ఎస్ వి హై స్కూల్ పాఠశాలలో చదివిన 1996- 97
బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి ఈ బ్యాచ్ కి చెందిన 10వ తరగతి విద్యార్థులు దాదాపు 30 మంది వివిధ రంగాలలో వివిధ దేశాల్లో స్థిరపడిన వాళ్లందరూ ఒక దగ్గరికి చేరి బాల్య స్మృతులను నెమరు వేసుకొని 28 సంవత్సరాల తర్వాత మొదటి సారిగా కలుసుకోవడం అందరిని కూడా అద్భుత ఆశ్చర్య ఆనందాన్నిచ్చింది. ఈ కార్యక్రమానికి ఒకప్పుడు భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాల పాటు పరిపాలించిన బ్రిటిష్ దేశంలోని సోలెహుల్ మెట్రోపాలిటన్ సిటీ బ్యూరోపాలిస్తున్న కౌన్సిలర్ శేషేంద్ర భట్టాచార్య పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా పూర్వ విద్యార్థి శ్రీనివాస్ రాథోడ్ స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు . కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
బాల్యం మరుపురానిదని అమూల్యమైనదని తిరిగి రానిదని దాన్ని కల్మషం లేని పిల్లలకు అదేవిధంగా అందించడంలోనే మహా అద్భుతం ఉంటుందని అప్పుడే వారు మానసికంగా, శారీరకంగా ఎదిగి ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అన్నారు. కానీ ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రుల తమ కోరికలను తమ పిల్లలతో భర్తీ చేయాలనుకోవడం కోరుకోవడం తప్పు అవుతుందని అన్నారు.
కార్యక్రమంలో ఈ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన భూదాన్ పోచంపల్లి మండల జడ్పిటిసి శ్రీ కరుణాకర్ రెడ్డి, సిబిఐటి మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ యాదగిరి, మిర్యాలగూడ పట్టణంలోని గ్రీన్ హుడ్ పబ్లిక్ కరస్పాండెంట్ చంద్రకళ, సాఫ్ట్వేర్ ఎథిక్ రిస్క్ మేనేజర్ విజయ్ చంద్ర రెడ్డి, హెచ్డిఎఫ్సి మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి,వెంకటేశ్వర్లు, పండిత్, సత్తిరెడ్డి, దుర్గేష్, జి సునీత,లక్ష్మీ శిల్ప సౌజన్య ,పద్మజ మంచుకొండ, ఎన్ సునీత, అంజలి, కవిత, కళ్యాణి తదితరులు పాల్గొని వారి అనుభూతులను పంచుకున్నారు.
కార్యక్రమం ప్రారంభంలో స్నేహితులు బ్యాచ్ మెంట్ కీ.శే.కేశవులు, కీర్తిశేషులు జగదీష్, మా విద్యాప్రదాత, నల్గొండ జల సాధన సమితి అధ్యక్షులు కొండకింది చిన్న వెంకటరెడ్డి గారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జాతీయ గీతాపన, తెలంగాణ రాష్ట్ర గేయoతో ప్రారంభించి అధ్యంతం ఆటపాటలతో కొనసాగడం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరం కలిసి పూర్వ విద్యార్థుల నిధిని ఏర్పాటు చేసుకొని విద్యాపరంగా అవసరమైన వారికి సహాయం నిర్ణయించడం జరిగింది.
