భారత్ న్యూస్ డిజిటల్: హైదరాబాద్: *జలమండలి ఎండీ ఆకస్మిక తనిఖీ
జలమండలి ఓఅండ్ఎం డివిజన్–18, మణికొండ సెక్షన్ పరిధిలో నర్సింగి మెయిన్ రోడ్డులో జంక్షన్ పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.
జంక్షన్ పనులు పరిశీలించి, అవసరమైన అన్ని భద్రతా చర్యలు (బ్యారికేడింగ్) తీసుకుంటూ, నిర్దేశిత కాలవ్యవధిలో పని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

లాన్సమ్ ఎల్డోరాడో కమ్యూనిటీ వాసులు మంచినీటి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. శాఖ పరమైన పరిశీలన అనంతరం, 2.2 ఎంఎల్ నర్సింగి 300 మి.మీ వ్యాసం గల డీఐ అవుట్లెట్ నుండి జంక్షన్ తీసుకొని, 250 మి.మీ వ్యాసం గల డీఐ లైన్ను 110 రన్నింగ్ మీటర్ల పొడవుతో వేయడం ద్వారా 200 మి.మీ వ్యాసం గల కనెక్షన్ను మంజూరు చేశారు.