విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఆటంకం కలిగించిన ఆటో డ్రైవర్‌ కు పది రోజులు రిమాండ్ విధించిన గౌరవనీయ కోర్టు,

భారత్ న్యూస్ విజయవాడ…విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి ఆటంకం కలిగించిన ఆటో డ్రైవర్‌ కు పది రోజులు రిమాండ్ విధించిన గౌరవనీయ కోర్టు

క్రైమ్ న్యూస్ కృష్ణా :

ప్రజా భద్రతను కాపాడడమే లక్ష్యంగా పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా, వారి విధులకు ఆటంకం కలిగించడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని జిల్లా ఎస్పి శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., గారు తీవ్రంగా హెచ్చరించారు.

వివరాల్లోనికి వెళితే నిన్న అనగా 15.12.2025 తేదీ కోనేరు సెంటర్లో పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక ఆటో డ్రైవర్ కొడాలి శివకృష్ణ @ సూర్య, తండ్రి నల్లయ్య, వయసు 29 సంవత్సరాలు, ఇంగ్లీష్ పాలెం, మచిలీపట్నం అను అతని AP 16 TD 3089 నెంబర్ కలిగిన ఆటోను కలిగి ఉన్నాడు. ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆటోను అక్కడనుండి తీయమన్నందుకు పోలీస్ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగి వారి యొక్క విధులకు ఆటంకం కలిగించి ప్రజలను భయభ్రాంతులను గురి చేసేలా వ్యవహరించడంతో అతనిపై రాబర్ట్ సన్ పేట పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచడం జరిగింది. ఈ కేసులు విచారణ జరిపి నిజం నిర్ధారణ కావడంతో ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినందుకు ఆటోడ్రైవర్ కు పది రోజులు రిమాండ్ విధించడం జరిగింది.

ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. పోలీస్ సిబ్బందిని అవమానించి, విధులకు ఆటంకం కలిగించే చర్యలను ఏ మాత్రం సహించబోమని హెచ్చరించారు.

ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ పోలీస్ సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని పోలీస్ శాఖ తరపు నుండి విజ్ఞప్తి చేయడం జరిగింది.