భారత్ న్యూస్ తిరుపతి,,18న మార్చి నెల శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల

Ammiraju Udaya Shankar.sharma News Editor…భక్తుల సౌకర్యార్థం 2026 మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్లను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ లక్కీడిప్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మో త్సవం, సహస్ర దీపాలంకార సేవా, సాలకట్ల తెప్పోత్సవాలు, సాలకట్ల వసం తోత్సవాల టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు తితిదే ఆన్ లైన్లో విడుదల చేయనుంది.
23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు.

ప్రత్యేక ప్రవేశదర్శనం రూ.300 టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరు మల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటాను విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in 3 బుక్ చేసుకోవాలని తితిదే అధికారులు సూచించారు.