మరోవైపు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అంతులేని అవినీతి

భారత్ న్యూస్ విశాఖపట్నం..మరోవైపు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అంతులేని అవినీతి. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కేవలం 99 పైసలకే దాదాపు 3 వేల కోట్ల విలువైన భూముల అప్పగింత. ఇంకా కాకినాడలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ.. ‘సీజ్‌ ది షిప్‌’ అని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ నానా హంగామా చేశారు. ఒక్క బియ్యం గింజ కూడా అక్రమంగా రవాణా చేయడానికి వీలులేదని అన్నారు. కానీ ఒక్క దానిపైనా చర్యలు లేవు. పోలీసుల జులుంతో ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారు. అందుకే ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు.

-బొత్స సత్యనారాయణ గారు, శాసనమండలి విపక్షనేత