భారత్ న్యూస్ నెల్లూరు..అగ్నిపర్వతం బద్దలు.. ఎగిసిపడ్డ లావా …
అమెరికాలో మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది. హవాయి ద్వీపంలోని కిలోవేయ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. పెద్దఎత్తున లావా ఉబికివచ్చింది. 100 అడుగుల మేర లావా ఎగిసిపడింది. డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా 38 సార్లు అగ్నిపర్వతం బద్దలైంది. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది..
