భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,రాష్ట్రంలో రూ.25వేల కోట్ల పెట్టుబడులు: కరణ్ అదానీ….
తెలంగాణలో రూ.25వేల కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీ గ్లోబల్ సమ్మిట్లో ప్రకటించారు. ఇప్పటికే అదానీ గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిందని గుర్తుచేశారు. అటు బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడుతోందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించి రేవంత్ సర్కార్ మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు….
