భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,,పెట్టుబడుల పేరుతో భారీ మోసం: సూర్యాపేట మునగాల సీఐ భార్య అరెస్ట్
సూర్యాపేట జిల్లా మునగాల సీఐ భార్య పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేసిన ఘటన హయత్నగర్లో బయటపడింది. బంగారం, గ్రానైట్ వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే లక్షల్లో లాభాలు వస్తాయని చెప్పి ఆమె పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించింది. భర్త పోలీస్ పదవిని అడ్డం పెట్టుకోవడంతో ప్రజలు ఆమెపై నమ్మకం ఉంచారు.
అయితే నెలలు గడిచినా వాగ్దానం చేసిన లాభాలు రాకపోవడంతో బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగారు. ఇదే సమయంలో “నన్నే డబ్బులు అడుగుతారా? మీ సంగతి చెబుతా” అంటూ ఆమె బెదిరించిందని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

ఫిర్యాదులపై స్పందించిన హయత్నగర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనతో పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలకు మరింత అప్రమత్తత అవసరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు